- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IBOMMA, BAPPAM పైరసీ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసిన పోలీసులు!
ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ (IBOMMA ) ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. కేసులో భాగంగా ఇమ్మడి రవికి మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అరెస్ట్ చేసిన సమయంలో పైరసీ మెటీరియల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన ఖాతాలో ఉన్న సుమారు రూ. 3 కోట్లు నగదు ఫ్రీజ్ చేసినట్లు అధికారుల సమాచారం. కూకట్‌పల్లిలో పట్టుబడిన అపార్ట్‌మెంట్‌లో పలు సినిమాలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు, కొన్ని సినిమాల హెచ్‌డీ ప్రింట్‌లు, కంప్యూటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
అయితే, సినిమాలు, వెబ్ సిరీస్‌లు పైరసీ చేసే దిగ్గజ IBOMMA, BAPPAM వెబ్‌సైట్‌లను పోలీసులు బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వెబ్ సైట్లు పనిచేయడం లేదని, తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు వాటిని బ్లాక్ చేసి ఉంటారని చర్చ జరుగుతోంది. తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు పైరసీ చేసే ఐ బొమ్మ, బప్పమ్ వెబ్‌సైట్‌లను పోలీసులు బ్లాక్ చేసినట్లు సమాచారం. మరోవైపు నెట్టింట ఉండే పైరసీ సైట్లపై పోలీసులు దృష్టి సారించినట్లు కన్పిస్తోంది.






