- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలవరం ప్రాజెక్టు అథారిటీ భేటీ షురూ.. హాజరైన ఇరు రాష్ట్రాల అధికారులు
పోలవరం ప్రాజెక్టు పురోగతిపై హైదరాబాద్‌లోని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) కాన్ఫరెన్స్ హాల్‌లో సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్టు పురోగతిపై హైదరాబాద్‌లోని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) కాన్ఫరెన్స్ హాల్‌లో సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్ట్ ప్రతినిధులు, తెలంగాణ తరపున ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, ఈఎన్సీ జనరల్ అంజద్ హుస్సేన్, ఇంటర్ స్టేట్ సీఈ ప్రసాద్, ఇంటర్ స్టేట్ అధికారులు విజయ్, సుబ్రమణ్య ప్రసాద్ హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పురోగతి, 2025-26 వర్కింగ్ సీజన్ యాక్షన్ ప్లాన్‌పై ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ (WRD) అధికారులు ప్రస్తుత సీజన్‌లో చేపట్టే కార్యక్రమాల టైమ్‌లైన్స్ వారీగా వివరించనున్నట్లుగా తెలుస్తోంది. లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధిత ప్యాకేజీలు పురోగతి, తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. కన్స్ట్రక్షన్ స్టేజ్ కోసం త్రిసభ్య కమిటీ రూపొందించిన ఎంవోను ఆమోదించబోతున్నట్లుగా సమాచారం.
ఇక CAG ఆడిట్ ఆబ్జెక్షన్స్ నేపథ్యంలో 41.15 మీటర్ల నీటి నిల్వకు సంబంధించి మార్పులు చేర్పులు చేసి కేంద్రం ఆమోదానికి పంపనున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ హెడ్‌క్వార్టర్స్‌ను రాజమండ్రి (బొమ్మూరు)కు షిఫ్ట్ చేసే అంశంపై కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోనన్నారు. ఇప్పటికే CE (P&D) ఆఫీసు రాజమండ్రి నుంచి పనిచేస్తుండగా.. ఆ కార్యాలయాన్ని భవిష్యత్తులో అమరావతికి తరలించే అవకాశం ఉంది. కన్స్ట్రక్షన్ దశలో 27 పోస్టులు (18 రెగ్యులర్ + 9 అవుట్‌సోర్సింగ్) నియామకాలకు ఆమోదం తెలుపనున్నారు. 2023-24, 2024-25 ప్రాజెక్టు కోసం చేసిన ఖర్చులపై చర్చించనున్నారు. అదేవిధంగా తెలంగాణతో ఇంటర్‌స్టేట్ ఇష్యూస్, సబ్‌మర్జెన్స్, డ్రైనేజ్ కంజెస్టన్, భద్రాచలం-మణుగూరు ప్రొటెక్షన్, మొత్తం 6 స్ట్రీమ్స్ స్టడీస్‌పై ఈ సమావేశంలో డిస్కస్ చేయనున్నారు.






