Poisoning Attempt: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై విషప్రయోగం.. ఆ జిల్లాలో షాకింగ్ ఘటన

by Prasad Jukanti |   ( Updated:2025-04-16 06:36:23.0  )
Poisoning Attempt: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై విషప్రయోగం..  ఆ జిల్లాలో షాకింగ్ ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని (Dharmapuri School) ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం (Poisoning Attempt) తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంకులో గుర్తుతెలియని దుండగులు పురుగుల మందు కలిపారు. ట్యాంక్‌తోపాటు మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా పురుగుల మందు చల్లారు. ఈ విషయాన్ని సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన గ్రామంలో అందరినీ షాక్‌కు గురిచేసింది. కాగా ఈ విషప్రయోగం ఘటనపై పోలీసులకు హెచ్ ఎం ప్రతిభ ఫిర్యాదు చేశారు. ఈ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. సిబ్బంది గమనించకుంటే విద్యార్థుల పరిస్థితి ఏంటంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed