- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pocharam Srinivas Reddy: అగ్రికల్చర్ అడ్వైజర్ గా పోచారం బాధ్యతల స్వీకరణ
అగ్రికల్చర్ అడ్వైజర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: వ్యవసాయ శాఖ సలహాదారుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ హార్టికల్చర్ ఆఫీసులో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన శ్రీనివాస్ రెడ్డి గత జూన్ లో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమించారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పోచారంకు వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.
Next Story






