రికార్డ్ క్రియేట్ చేసిన కోకాపేట్ ల్యాండ్.. ఎకరం రూ.136.50 కోట్లు

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-24 11:46:06  IST  )

రికార్డ్ క్రియేట్ చేసిన కోకాపేట్ లాండ్.. ఎకరం రూ.136.50 కోట్లు

రికార్డ్ క్రియేట్ చేసిన కోకాపేట్ ల్యాండ్.. ఎకరం రూ.136.50 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా కోకాపేట(Kokapet)లోని నియో పోలీసు లే ఔట్‌లోని రెండు ప్లాట్లకు ప్రభుత్వం సోమవారం ఈ-వేలం నిర్వహించింది. ఈ-వేలంలో ప్లాట్ నెంబర్ 17, 18కి రికార్డు ధర పలికింది. ఎకరం ధర 137.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్17లో 4.59 ఎకరాలు ఉండగా.. ఈ వేలంలో ఎకరానికి రూ.136.50 కోట్ల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలు ఉండగా.. ఈ వేలంలో ఎకరానికి రూ.137.25 కోట్ల ధర పలకడం గమనార్హం. ఇవాళ్టి వేలంలో 9.90 ఎకరాలకు రూ.1,355.33 కోట్లను HMDA పొందడం విశేషం. 17లోని 4.59ఎకరాలను రూ.136.25కోట్లకు వజ్ర బిల్డర్ కంపెనీ దక్కించుకుంది. కాగా, అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణ దారులను దృష్టిలో ఉంచుకొని HMDA ఈ వేలం నిర్వహించింది. గతంలో కోకాపేట్‌లో ఎకరం రూ.100 కోట్ల వరకు వేలం వేయగా, ఈసారి కూడా దానికి మించి ధర పలకడం విశేషం. అంతర్జాతీయ హంగులతో లేఅవుట్ ఒకవైపు.. 2 కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్, మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు, ఫైనాన్షియల్​డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండడంతో నియోపోలిస్​ లేఅవుట్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చర్చించుకుంటున్నారు.

Next Story