- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దయచేసి నాపై ఏవేవో రాతలు రాయకండి.. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కీలక అభ్యర్థన
బీఆర్ఎస్ (BRS) పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ (BRS) పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు తాజాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఒక్కొక్కరినిగా విచారణకు పిలిచి వారి అనర్హతపై నిర్ణయం తీసుకోబోతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్‌లో చెక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ బీ ఫామ్‌పై గెలిచానో.. ఇప్పుడు అదే పార్టీలో ఉన్నానని స్పష్టం చేశారు. తాను మొదటి నుంచి అదే విషయం చెబుతున్నానని, ఇప్పుడు కూడా అదే మాట మీదే ఉన్నానని అన్నారు. దయచేసి తన విషయంలో ఏవేవో రాతలు రాయొద్దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి పాత్రికేయ మిత్రులకు విజ్ఞప్తి చేశారు.






