- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BC reservations: స్థానిక సంస్థలపై హైకోర్టు స్టే.. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్లాన్-బి ఇదేనా?
స్థానిక ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Elections) తెలంగాణ హైకోర్టు (High Court) స్టే విధించింది. దీంతో ఈ ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్తామని పదే పదే చెబుతున్న అధికార కాంగ్రెస్.. ఈ విషయం కోర్టుకు వెళ్లిన నాటి నుంచి నిశితంగా పరిశీలింస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, పీసీసీతో నిన్న కీలక సమావేశం నిర్వహించారు. అయితే ఇవాళ కోర్టు స్టే విధించడంతో హైకోర్టు కాపీ వచ్చాక ముఖ్యమంత్రి ఈ అంశంపై మంత్రులు, పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. కాగా తాజాగా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఇవే అంటూ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
వీటి ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీకోర్టును ఆశ్రయించి హైకోర్టు ఇచ్చిన స్టే ను వెకేట్ చేయాలని కోరడం, పార్టీ తరపున 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం లేదా పాత రిజర్వేషన్లతో మరో నోటిఫికేషన్ ఇవ్వడం, హైకోర్టులో కేసు తేలేవరకు ఎన్నికలు వాయిదా వేసే ఆప్షన్స్ ఉన్నాయనే చర్చ జరుగుతోంది. వీటిలో ప్రభుత్వం ఏ ఆప్షన్ ను ఎంచుకోబోతోంది అనేది సస్పెన్స్ గా మారింది. న్యాయపరంగా చిక్కులు ఎదురైతే తమ వద్ద ప్లాన్ - బీ కూడా ఉందని అధికార పార్టీ నేతలు ఇదివరకే చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్న ప్లాన్ -బీ (Congress Party Plan-B) ఏంటి అనేది త్వరలో తేలెే అవకాశం ఉంది.






