- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నగరవాసులకు అందుబాటులోకి మరో ఫ్లైఓవర్..
ఈ నెల 28న శేరిలింగంపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో, ఎలాంటి లోపాలు ఉండకూడదన్న దృష్టితో అన్ని ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ నెల 28న శేరిలింగంపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో, ఎలాంటి లోపాలు ఉండకూడదన్న దృష్టితో అన్ని ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
శుక్రవారం కమిషనర్ కర్ణన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే మరియు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, జోనల్, ప్రాజెక్టు ఇంజనీర్లతో కలిసి శిల్పా లేఅవుట్ ఫేస్-2 ఫ్లైఓవర్ (పి. జనార్దన్ రెడ్డి ఫ్లైఓవర్) ప్రాంతాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ శిలాఫలకం ప్రాంతంతో పాటు, పబ్లిక్ మీటింగ్ వేదికను కూడా వారు పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ, రూ.182.72 కోట్ల అంచనా వ్యయంతో ఓఆర్‌ఆర్ నుండి కొండాపూర్ వరకు 1.20 కిలోమీటర్ల పొడవులో నిర్మించిన 6 లైన్ల బై-డైరెక్షన్ ఫ్లైఓవర్‌ను ఈ నెల 28న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలిపారు.
ఈ ఫ్లైఓవర్ ప్రారంభం వలన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని, తిరుగు ప్రయాణంలో కొండాపూర్ వైపు వెళ్లే వారికి గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ పరిశీలనలో జోనల్ కమిషనర్ హేమంత్ సహదేవ్ రావు, ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి, ఎస్‌ఈలు, డిప్యూటీ ఈఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.






