- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad metro: మెట్రో రైలుతో వాటికి ముప్పు.. హైకోర్టులో పిల్
మెట్రో రైలు విస్తరణ పై హైకోర్టులో పిల్ దాఖలైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో రైలు విస్తరణకు (Hyderabad మెట్రో (Metro Expansion) ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలపై పని చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెట్రో రైలు విస్తరణపై తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. పలు చారిత్రక కట్టడాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఏపీడబ్ల్యూఎఫ్ ఈ పిల్ ను దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, మెట్రో రైలు ఎండీ, వక్ఫ్ బోర్డు సీఈవో ను పిటిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ హెరిటేజ్ యాక్ట్ -2017 ప్రకారం చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సి ఉంది. కానీ పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణం వల్ల చార్మినార్, ఫలక్ నుమా ప్యాలెస్, పురాణాహవేలీ, మొఘల్ పుర సమాధులు వంటి చారిత్రక కట్టడాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అందువల్ల మెట్రో డిజైన్ల హైకోర్టు లేదా నిపుణుల బృందం ఆమోదించిన తర్వాతే ముందుకు వెళ్లాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.






