ఫోన్ ట్యాపింగ్ కేసు.. నాంపల్లి కోర్టులో సిట్ మరో పిటిషన్ దాఖలు

by Kema Shiva Kumar |

ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్‌ రావు (Sravan Rao) ఇటీవలే ఓ చీటింగ్ కేసు (Cheating Case)లో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నాంపల్లి కోర్టులో సిట్ మరో పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case)లో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్‌ రావు (Sravan Rao) ఇటీవలే ఓ చీటింగ్ కేసు (Cheating Case)లో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయనను ఈనెల 23న నాంపల్లి కోర్టు (Nampally Court)లో ప్రవేశ పెట్టారు. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితుడు శ్రవణ్ రావును విచారించాలంటూ 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరగా.. ఒక్కరోజు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ క్రమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా నిందితుడు శ్రవణ్‌ రావును ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (Prisoner's Transit) వారెంట్‌పై కస్టడీలోకి తీసుకోవడానికి సిట్‌ అధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ నాంపల్లి కోర్టు (Nampally Court)లో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. కాగా, మరోవైపు ఇదే కేసులో కీలక నిందితుడిగా ఉన్న SIB మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు (Prabhakar Rao) వచ్చే నెల 20న విచారణకు నాంపల్లి కోర్టులో హాజరు కావాల్సి ఉంది. ఒకవేళ ఆయన కోర్టుకు హాజరుకాని పక్షంలో ‘ప్రకటిత నేరస్థుడు’గా పరిగణించే చాన్స్ ఉంది.

Next Story