- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్స్ట్ కవితకు నోటీసులు?
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone tapping case) దర్యాప్తు పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీఆర్ఎస్ లోని అగ్రనేతలకు వరుసగా నోటీసులు ఇస్తున్న దర్యాప్తు బృందం ఈ క్రమంలో తదుపరి నోటీసులు ఎవరికి ఇవ్వబోతోందనే సస్పెన్స్ అందరిలో వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (Kalvakuntla Kavitha) సిట్ (SIT) విచారించబోతున్నట్లు తెలుస్తోంది. కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్, బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ సంతోశ్ రావుకు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది. అతి త్వరలోనే వీరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆఖర్లో కేసీఆర్!
సుదీర్ఘంగా కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తాజాగా ఊహించని మలుపులు నమోదు అవుతున్నాయి. హరీశ్ రావు, కేటీఆర్‍ను బ్యాక్ టు బ్యాక్ ప్రశ్నించి వారి స్టేట్ మెంట్ రికార్డు చేసుకుంది. తాజాగా కవిత నుంచి స్టేట్ మెంట్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తన భర్త ఫోన్లను ట్యాప్ చేశారని కవిత గతంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు. అయితే ఈ కేసులో వరుసగా కేసీఆర్ కుటుంబ సభ్యులకు సిట్ నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్ కుటుంబ సభ్యులనంతా ప్రశ్నించాక ఆఖర్లో కేసీఆర్ ను విచారణకు పిలిచే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.






