- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా మహేశ్వరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy)కి నోటీసులు జారీ చేసింది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విచారణకు హాజరుకావలసి ఉంటుంది.
కాగా, తీగల కృష్ణారెడ్డి 2014 నుంచి 2018 మధ్య కాలంలో మహేశ్వరం (Maheshwaram) ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన కొన్ని కీలక పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై ఆయనను అధికారులు ప్రశ్నించనున్నట్లుగా సమాచారం. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు వెలుగులోకి రాగా, వారికి సీట్ నోటీసులు ఇచ్చి వారిచ్చిన స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. తాజాగా మాజీ ఎమ్మెల్యే తీగలకు నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.






