Phone Tapping Case: సిట్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో సిట్‌ అధికారులు దూకుడు పెంచారు. ఒక్కరిని కూడా వదలకుండా బాధితులందరినీ విచారిస్తున్నారు.

Phone Tapping Case: సిట్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో సిట్‌ అధికారులు దూకుడు పెంచారు. ఒక్కరిని కూడా వదలకుండా బాధితులందరినీ విచారిస్తున్నారు. విచారణలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)కి గురువారం సిట్‌ మరోసారి నోటీసులు పంపింది. ఈనెల 24వ తేదీన వాంగ్మూలం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా సిట్ నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. గురువారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్(KCR) పాపాల వల్లే పోలీసుల నుంచి నాకు లేఖ వచ్చిందని మండిపడ్డారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల నుంచి నాకు నోటీసులు వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం.. నాతో పాటు నా కుటుంబం, నా సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేయించింది. పడక గదిలో దంపతుల మాటలు కూడా విని.. అనేక మంది జీవితాలను కేసీఆర్ కుటుంబం నాశనం చేసింది. నా తెలిసిన, నా వద్ద ఉన్న సమాచారం మొత్తం పోలీసులకు ఇస్తా’ అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాగా, అమెరికా నుంచి ప్రభాకర్ రావు రాక తరువాత ఈ కేసు విచారణలో సిట్ మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ హయాంలో వందల సంఖ్యలో కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్యాప్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ కారణంగా తాము రాజకీయంగానూ నష్టపోయాయని.. గెలవాల్సిన కొన్ని సీట్లలో ఓడిపోయామనేది రాజకీయ నాయకుల వాదిస్తోన్న విషయం తెలిసిందే.

Next Story