- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ నుంచి పాకిస్తాన్‌కు ఫోన్.. భారీ కుట్రకు బడా ఉగ్రసంస్థ ప్లాన్
హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ ఉగ్రకుట్ర బట్టబయలైంది. అరెస్ట్ అయి.. నగరంలోని చంచల్‌గూడ జైలులో ఉన్న వ్యక్తి.. ఏకంగా జైలునుంచే ప్లాన్ వేశాడు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కేంద్రంగా మరో భారీ ఉగ్రకుట్ర బట్టబయలైంది. అరెస్ట్ అయి.. నగరంలోని చంచల్‌గూడ జైలులో ఉన్న వ్యక్తి.. ఏకంగా జైలునుంచే ప్లాన్ వేశాడు. ఈ కుట్ర తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గత దసరా పండుగ రోజున హైదరాబాద్‌లో వరుస పేలుళ్లకు ప్రణాళిక చేసి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మూసారాంబాగ్‌కు చెందిన అబ్దుల్ జాహెద్ అలియాస్ మోటు, అక్చర్‌బాగ్‌కు చెందిన మహ్మద్ సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమి, మాజ్ హసన్ ఫరూక్ అలియాస్ మాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మూసారాంబాగ్, చంపాపేట్, మలక్‌పేట్ తదితర ప్రాంతాల్లోని పలు నివాసాల్లో పోలీసులు మెరుపు సోదాలు చేశారు.
అయితే.. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న లష్కరే తోయిబా ఉగ్రవాది జాహెద్ ఈ మధ్య తరచుగా పాకిస్తాన్‌లో ఉన్న తన సోదరుడు మాజీద్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు నిఘా వర్గాల బృందం ఈ నెల 17న హైదరాబాద్ నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. నగరంలో మరోసారి భారీ కుట్రకు లష్కరే తోయిబా ప్లాన్ చేస్తోందని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన నియామకాలు కూడా చేపట్టారని, అవసరమైన ఆర్థిక సాయం పాకిస్తాన్ నుంచి అందినట్లు అప్పట్లోనే జాహెద్ పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా అంగీకరించాడు. మరోవైపు ఈ విషయంపై ఆరా తీయగా, జైలు నుంచి మాజిద్ ఫోన్ మాట్లాడుతున్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని నిఘా విభాగానికి చెందిన ఒక అధికారి స్పష్టం చేశారు.






