- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త..! సీఎం రేవంత్ రెడ్డికి కవిత స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణను మోసం చేసిన అదే ‘స్క్రిప్ట్’తో రేవంత్ రెడ్డి ఇప్పుడు కేరళకు వచ్చారని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా సంచలన వీడియో విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ క్రమంలోనే అక్కడ ఎల్‌డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం అక్కడ ప్రచారంలో పాల్గొంటూ పినరయి విజయన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రేవంత్‌కు కౌంటర్‌గా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ నిలువునా మోసం చేశారంటూ తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సంచలన వీడియోను విడుదల చేశారు. ఆ వీడియాలో కవిత మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘6 గ్యారంటీలు’ అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను గాలికొదిలేశారని, ఇప్పుడు అదే స్క్రిప్ట్‌తో రేవంత్ రెడ్డి కేరళకు వస్తున్నారని కామెంట్ చేశారు. తెలంగాణలో రైతు రుణమాఫీ, ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమం వంటి ప్రధాన వాగ్దానాలన్నీ ఇప్పటికీ అమలు కాదేదని చురకలంటించారు.
తెలంగాణ (Telangana)లో విఫలమైన అదే మోసపూరిత హామీలను ఇప్పుడు కేరళ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి వాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ తరహాలో కేరళ ప్రజలు కూడా కాంగ్రెస్ బాధితులుగా మారొద్దని, అభివృద్ధిని కొనసాగించాలంటే పినరయి విజయన్ (Pinarayi Vijayan) వంటి నిరూపితమైన నాయకత్వాన్నే ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కేరళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కవిత చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






