- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజాభవన్‌లో దరఖాస్తుల వెల్లువ
by GSrikanth |
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ తెల్లవారుజాము నుంచే తమ సమస్యలు తెలుపడానికి అర్జీలతో ప్రజలు భారీగా క్యూలు కట్టారు.
దీంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. ముఖ్యంగా ధరణి భూముల సమస్య, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, 317 జీవో రద్దు, వైద్యం, నిరుద్యోగులకు ఉద్యోగాలు లాంటి తదితర అంశాలపై ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికారులు అర్జీలను తీసుకుని పంపిస్తున్నారు. ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న తమకు న్యాయం జరగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






