హిల్ట్ పాలసీపైన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Muthe.Rajitha |

హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ లాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హెచ్‌ఐఎల్టీపీ)పైన కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

హిల్ట్ పాలసీపైన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌ ఇండస్ట్రియల్‌ లాండ్స్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ పాలసీ (హెచ్‌ఐఎల్టీపీ)పైన కేటీఆర్, హరీష్ రావులు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వారి హాయాంలో తెచ్చిన జీవోలకు, మా ప్రభుత్వ పాలసీకి తేడా ఉందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం భూ బదాలాయింపు పాలసీలో గతంలో భూముల్ని కొనుగోలు చేసి భూ యాజమాన్య హక్కులున్న వారి భూములను మల్టీ యూజ్ జోన్ మార్చడానికి ప్లాట్ 80 అడుగుల కంటే తక్కువ రోడ్డును ఉన్నట్లయితే ఎస్ఆర్వో రేటు 30 శాతం ఇంపాక్ట్ ఫీజు, ప్లాట్ 80 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ రోడ్డును ఉన్నట్లైతే ఎస్ఆర్వో రేటు 50 శాతం శ్లాబుల్లో ఇంపాక్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.

బీఆర్ఎస్ హాయాంలోని పాలసీలో లీజు హోల్డర్లకు సంబంధించిందని, ఆ భూములు, ఆ భూముల బదలాయింపులపైన లీజు దారులకు హక్కులుండవని, అమ్ముకునే హక్కులు ఉండవని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం పరిశ్రమలను అవుర్ రింగురోడ్డు బయట ఏర్పాటు చేస్తున్నందున నగరంలో ఉన్న పరిశ్రమలకు ఇచ్చిన భూములను మల్టీ యూజ్ జోనల్ కన్వర్షన్ చేసుకునేందుకు 30శాతం, 50శాతం రెండు శ్లాబుల్లో ఫీజులను సొంత భూములున్న వారి దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

ఈ నిధులను 25శాతం రింగురోడ్డు బయట పారిశ్రామికావృద్దికి ఖర్చు చేస్తున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ పాలసీ పైన ప్రభుత్వం మంత్రుల సబ్ కమిటీ వేసి చర్చింస్తుందని, బీఆర్ఎస్ హాయాంలో నియంతలాగా వ్యవహారిస్తూ ఫాంహౌజ్ లో ఉండి జీవోలు ఇచ్చారని ఆయన ఆరోపించారు.

Next Story