- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతున్న దర్యాప్తు!
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు (Telangana Phone Tapping Case) దర్యాప్తు ప్రస్తుతం ఓ పెన్ డ్రైవ్ చుట్టూ తిరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ (KCR), మాజీ మంత్రి హరీశ్ రావులకు (Harish Rao) సిట్ (SIT) నోటీసులు ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పుడు ఈ కేస్ ప్రూవ్ చేయడానికి ఈ పెన్ డ్రైవ్ (Pen Drive) సాలిడ్ ఎవిడెన్స్ అని సిట్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటం ఉత్కంఠ రేపుతోంది. ఎస్ఐబీ చీఫ్ గా ఉన్న సమయంలో ప్రభాకర్ రావు ఆ పెన్ డ్రైవ్ లో కీలక సమాచారం నిక్షిప్తం చేశారని ఈ పెన్ డ్రైవ్ లో వందల నెంబర్లు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జీలు, వ్యాపారవేత్తల ప్రొఫైల్స్ ఈ పెన్ డ్రైవ్‍లో ఉన్నాయని ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ సమాచారం ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తుట్లు సమాచారం. ఎల్లుండి వరకు ప్రభాకర్ రావును సిట్ విచారించనున్న నేపథ్యంలో ఈ పెన్ డ్రైవ్ కు సంబంధించి మరింత లోతుగా ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది.
మరో వైపు కీలక మలుపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, హరీశ్ రావుకు ఉచ్చు బిగుస్తోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభాకర్ రావుతో (Prabhakar Rao) పాటు ఇద్దరు మాజీ సీఎస్‍లు, మాజీ ఎస్‍ఐబీ చీఫ్‍ను సిట్ విచారించింన నేపథ్యంలో ఎవరి ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనే విషయంపై దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. ఇప్పటికే అనేక మలుపులు తిరిగిన ఈ కేసులో తాజాగా పెన్ డ్రైవ్ అంశం మరో సంచలనంగా మారింది. ఈ పెన్ డ్రైవ్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఉత్కంఠ రేపుతోంది.






