- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మార్వాడీల విషయంలో కాంగ్రెస్ స్టాండ్ ఇదే.. పీసీసీ ఛీప్ మహేశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు.. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని అన్నారు. ఇప్పటికే తాను క్షమశిక్షణ కమిటీని ఆదేశించాను.. ముందు రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో అన్నారో తెలుసుకుంటామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అతి త్వరలోనే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుందని చెప్పారు. మార్వాడీలు మనలో ఒకరు.. వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదన్నారు. కాగా, తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ప్రచారం మొదలైన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలో భాగంగా ఈ ప్రచారం తెరమీదకు తెస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. కమ్యునిస్టులు ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం చేస్తున్న డ్రామాలివంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు.






