- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ సర్కారుపై పీసీసీ ఛీప్ ఫైర్
రాజ్యంగ పరిరక్షణ ధ్యేయంగా.. జైబాపు..జైభీమ్..జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యంగ పరిరక్షణ ధ్యేయంగా.. జైబాపు..జైభీమ్..జై సంవిధాన్ కార్యక్రమాలు చేపట్టామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై ఆయన ఫైర్అయ్యారు. ముఖ్యంగా భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్బాబా సాహేబ్అంబేద్కర్ను పార్లమెంట్సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమీత్షా అవమానించారని పేర్కొన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. మనుస్మృతిని అమలు చేయాలని బీజేపీ నేతల కుటిల ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. దేశ సమగ్రతకు, అఖండతకు తూట్లు పొడిచే విధంగా ప్రధాని , అమిత్ షా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అధికారమే పరమావధిగా ..అధికారం లేకుంటే బతకలేమనే విధంగా బీజేపీ నేతల తీరు ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ స్వలాభం కోసం బీజేపీ నేతలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని విచ్చినం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
దేశ విచ్ఛిన్న శక్తుల కుట్రలను తిప్పికొట్టేందుకు ఖర్గే, సోనియా గాంధీ , రాహుల్ గాంధీ పిలుపు మేరకు గల్లి నుంచి ఢిల్లీ వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా చేసిన అభివృద్ది చెప్పుకోలేని స్థితిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. 400 సీట్లు వస్తాయని నమ్మ బలికిన బీజేపీ నేతలకు ప్రజలు తగిన రీతిలో బుద్ద్ది చెప్పారు..అయిన వారిలో మార్పు రాలేదన్నారు. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తో దేశాన్ని భౌగోళికంగా, సామాజికంగా, రాజకీయంగా అర్థం చేసుకోగలిగారు అని అన్నారు. దేశంలో అసమానతలు,ఆర్ధిక వ్యత్యాసం రూపుమాపేందుకు రాహుల్ గాంధీ కుల సర్వేకు శ్రీకారం చుట్టారని చెప్పారు. రాహుల్ గాంధీ ఆశయం మేరకు సీఎం రేవంత్ రెడ్డి కుల సర్వే పూర్తి చేసి ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారో? తేల్చిచెప్పారన్నారు. ఖర్గే , రాహుల్ గాంధీ సూచన మేరకు ఒక బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీలకు కేబినెట్ లో పదవులు కట్టబెట్టామన్నారు. పిసిసి కార్యవర్గంలో సైతం 70 శాతం మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వారికి చోటు కల్పించి.. సామాజిక న్యాయానికి , మహిళలకు పెద్దపీట వేశామని స్పష్టం చేశారు.
ప్రధాని పాకిస్థాన్ పై యుద్ధం అని ప్రగల్భాలు పలికి ట్రంప్ చెప్పగానే తోక ముడిచారని విమర్శించారు. 92 వేల సైనికులను ముక్కును నేలరాపించిన చరిత్ర అపర ఖాళీ మాత ఇందిరా గాంధీదని అన్నారు. ప్రధాని పదవిపై మోడీకి యావ తప్ప..దేశంపై ప్రేమ లేదని పేర్కొన్నారు. పాకిస్థాన్ పై యుద్ధంలో దేశం సాధించింది ఏంటి? కోల్పోయింది ఏంటి? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోందని ఈసందర్భంగా మహేష్కుమార్గౌడ్పేర్కొన్నారు.






