- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బకాయిలు చెల్లించండి : ప్రభుత్వానికి మద్యం కంపెనీల లేఖ
రాష్ట్ర ప్రభుత్వం బాకాయిలు చెల్లించాలని లేని పక్షంలో రాష్ట్రంలో మద్యం కోరత ఏర్పడనుందని మద్యం కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం బాకాయిలు చెల్లించాలని లేని పక్షంలో రాష్ట్రంలో మద్యం కోరత ఏర్పడనుందని మద్యం కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ), బ్రేవర్స్ అసోసియేషన్ ఆప్ ఇండియా( బీఏఐ), కాన్ఫిడేరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహలిక్ బేవరేజ్ కంపెనీస్(సీఐఏబీసీ)లు లేఖలో పేర్కోన్నాయి. రాష్ట్రం నుంచి రావల్సిన బకాయిలు రూ.3366కోట్లు ఉన్నట్లు తెలిపాయి.
నవంబర్ 2వ తేదిన పంపిన లేఖలో పేర్కోంది. ఆల్కోబెవ్ కంపెనీలకు దీపావళి నిరాశాజనకంగా ఉందని, పండుగ సీజన్ విషాదకరంగా ఉందని పేర్కోన్నాయి. చెల్లింపు సంక్షోభం తీవ్రమవుతున్నందున తెలంగాణలో పండుగ సీజన్‌లో మద్య పానీయాల కొరతను ఆశించండి అని పరిశ్రమ సంఘాలు చెబుతున్నాయని పేర్కోన్నాయి. జూన్ నుంచి అక్టోబర్ వరకు ప్రభుత్వం చెల్లించిన బకాయిలు వివరాలు వెల్లడించాయి.
అక్టోబర్ నెలలో 50శాతం రూ.484.58కోట్లు చెల్లించినట్లు తెలిపాయి. 2024 మే నుంచి ఆగస్టు వరకు ఉన్న రూ. 1959కోట్ల బకాయిలతో కలిపి మొత్తం రూ.3366కోట్ల బకాయిలు ఉన్నట్లు పేర్కోన్నాయి. 45రోజులలో చెల్లిస్తామని హమి ఇచ్చి ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడిందని వెల్లడించాయి. నూతన లైసెన్స్ ద్వారా రూ. 3వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిన బాకాయిలు విడుదల చేయలేదని తెలిపాయి.
నవంబర్ 10వ తేది లోపు రూ.3వేల కోట్ల బకాయిలు క్లీయర్ చేయాలని వెల్లడించాయి. లేని పక్షంలో డిసెంబర్ నెలలో మద్యం సరఫరా చేయలేమని తెలిపాయి. 90శాతం వాటా రాష్ట్ర మద్య సరఫరాలో కలిగి ఉన్నామని, దేశ వ్యాప్తంగా రూ.3లక్షల కోట్లకు పన్నులు చెల్లిస్తున్నామని 15లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగాను ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కోన్నాయి.
- Tags
- liquor






