- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ బిల్లులను రికార్డులు చూసి చెల్లించండి.. మంత్రి సీతక్క
తెలంగాణలో గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల చెల్లింపుపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు జారీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: 2023-24 ‘టైడ్ కాంపొనెంట్’ కింద విడుదలైన నిధుల నుంచి గత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను రికార్డులు సరిచూసి చెల్లించాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేసినట్లు పంచాయతీ రాజ్ శాఖ వెల్లడించింది. గత సర్పంచ్‌లు చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ఎట్టకేలకు పంచాయతీ రాజ్ శాఖ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి గ్రామ పంచాయతీలకు టైడ్ కాంపొనెంట్ కింద రూ. 245 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి బేసిక్ అన్‌టైడ్, టైడ్ గ్రాంట్స్ కింద రూ. 640.07 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. గత సర్పంచ్‌ల పదవీకాలం ఫిబ్రవరి 1, 2024తో ముగిసిన నేపథ్యంలో, 2023-24 సంవత్సరానికి విడుదలైన టైడ్ కాంపొనెంట్ నిధులతో చేపట్టిన తాగునీరు, పారిశుధ్య పనులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో ఉన్న మేరకు మాత్రమే గత సర్పంచ్‌లకు బిల్లులు చెల్లించవచ్చని స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉన్న నిధుల నుంచి మల్టీ పర్పస్ వర్కర్ల వేతనాలు చెల్లించాలని సూచించారు. ఈ మేరకు జిల్లా స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.






