ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నాకు ఇష్టం..ఆయనను వదిలేయమని పోలీసులకు చెప్పా: పవన్ కల్యాణ్

by Ajay Maddhiboyina |

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ వ్యాఖ్య‌ల‌పై మ‌రోసారి స్పందించారు. ఈ మ‌ధ్య విశ్లేష‌కులు త‌న‌ను ఎంత‌గానో తిడుతున్నార‌ని అన్నారు. వాళ్ల విశ్లేష‌ణ‌ల‌కు అర్థం ప‌ర్థం ఉండ‌ట్లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే నాకు ఇష్టం..ఆయనను వదిలేయమని పోలీసులకు చెప్పా: పవన్ కల్యాణ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ వ్యాఖ్య‌ల‌పై మ‌రోసారి స్పందించారు. ఈ మ‌ధ్య విశ్లేష‌కులు త‌న‌ను ఎంత‌గానో తిడుతున్నార‌ని అన్నారు. వాళ్ల విశ్లేష‌ణ‌ల‌కు అర్థం ప‌ర్థం ఉండ‌ట్లేద‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. వాళ్లు ఎద‌గ‌డానికో లేదంటే గుర్తింపు కోస‌మో త‌న గురించి మాట్లాడున్నార‌ని అన్నారు. ప్రొఫొస‌ర్ నాగేశ్వ‌ర్ రావుపై కేసులు పెడ‌తానని అంటే వ‌ద్ద‌ని చెప్పాన‌న్నారు. పొర‌పాటున మాట్లాడి ఉంటార‌ని వ‌దిలేయాల‌ని చెప్పిన‌ట్టు తెలిపారు. ఆయ‌న అంటే త‌న‌కు చాలా ఇష్టం అని ఒక‌మాట పిల‌వ‌గానే పెళ్లికి వెళ్లాన‌ని అన్నారు.

త‌నను తిట్టే వ్య‌క్తి, విమ‌ర్శించే వ్య‌క్తి ఇంట్లో పెళ్లి జ‌రిగినా తాను వెళతానని అంబటి రాంబాబు ఇంట్లో పెళ్లికి కూడా తాను వెళ్లినట్టు చెప్పారు. తన సంస్కారం అలా ఉంటుదని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు తెలంగాణ వెళ్లారని అంటే వెంటనే వద్దని చెప్పినట్టు తెలిపారు. అసలు అలాంటి ప్రస్తావన కూడా తీసుకురావద్దని చెప్పానని అన్నారు. సీనియర్ విశ్లేషకులు అంటే ఓకే కానీ, కొన్ని వెబ్ సైట్స్, కొంతమంది కావాలని తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. అలాంటివాళ్లపై కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Next Story