పార్టీ మార్పు ప్రచారం.. మాజీ మంత్రి గంగుల క్లారిటీ

by Disha Web Desk 4 |
పార్టీ మార్పు ప్రచారం.. మాజీ మంత్రి గంగుల క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ మార్పు ప్రచారంపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ రాజకీయాల కోసమే ఎండిన పంటలను పరిశీలిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. ప్రతిపక్షాలు ఏడాది వరకు ప్రభుత్వ పనితీరు చూడాల్సి ఉండగా మూడు నెలలకే రైతులు తెలంగాణలో ఆగం అవుతున్నారని అందుకే కేసీఆర్ రంగంలోకి దిగారన్నారు. కేసీఆర్ పర్యటన తర్వాత రెండు ప్రాంతాల్లో లిఫ్ట్ ద్వారా నీటిని అందిస్తున్నారని గుర్తు చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య పోటీ అంటూ సాగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి మాట్లాడుతూ.. జూన్ 4న ఫలితాలు వస్తాయని గ్రామాల్లో రైతుల ఒపినియన్ అడిగితే అసలు విషయం తెలుస్తుందన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలన చూసిన రైతులు గులాబీ నేత పక్షానే ఉంటామంటున్నారని వివరించారు.



Next Story

Most Viewed