Agricultural students: పీసీబీని సందర్శించిన పాలెం విద్యార్థులు

by Ramesh Naini |

నాగర్ కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు తమ పర్యావరణ శాస్త్రం, విపత్తు నిర్వహణ కోర్సు ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్‌లో భాగంగా సనత్ నగర్ లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిని మంగళవారం సందర్శించారు.

Agricultural students: పీసీబీని సందర్శించిన పాలెం విద్యార్థులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు తమ పర్యావరణ శాస్త్రం, విపత్తు నిర్వహణ కోర్సు ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పోజర్‌లో భాగంగా సనత్ నగర్ లోని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (Telangana Pollution Control Board)ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పర్యావరణ శాస్త్రవేత్త పి. శరత్ .. విద్యార్థులకు వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, ప్లాస్టిక్ కాలుష్యం, బయోమెడికల్ వ్యర్థాల కాలుష్యం, మురుగునీటి శుద్ధి విధానాలు వంటి వివిధ కాలుష్య రకాలపై సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు విధించే జరిమానాలు మరియు శిక్షలు గురించి వివరించి, పరిశ్రమలు, సంస్థలు పర్యావరణ ప్రమాణాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని హైలైట్ చేశారు.

ప్రాక్టికల్ ఎక్స్పోజర్‌లో భాగంగా విద్యార్థులకు పీసీబీ ప్రయోగశాల సౌకర్యాలను చూపించి, వాయు, నీటి కాలుష్య స్థాయిలను కొలిచే పరికరాలు, శాస్త్రీయ పద్ధతులు గురించి వివరించారు. ఈ సందర్శన ద్వారా విద్యార్థులకు కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థలు, వ్యర్థాల నిర్వహణ పద్ధతులు, పర్యావరణ పరిరక్షణ చర్యలపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. ఈ సందర్శనలో పాలెం వ్యవసాయ కళాశాలకు చెందిన అధ్యాపకులు అభిలాష్, పరమేష్, విద్యార్థులు ఇంటరాక్టివ్ సెషన్‌లో చురుకుగా పాల్గొన్నారు. ఈ ఫీల్డ్ విజిట్ తమకు ఎంతో సమాచార భరితంగా, ఉపయోగకరంగా నిలిచి, సిద్దాంతపరమైన జ్ఞానాన్ని వాస్తవ ప్రపంచ పర్యావరణ నిర్వహణ విధానాలతో అనుసంధానించడంలో ఉపయోగకరమని విద్యార్థులు అన్నారు.

Next Story