ముసురుకు వణుకుతున్న పాలమూరు.. ఫొటో ఫీచర్

by Disha Web Desk 11 |
ముసురుకు వణుకుతున్న పాలమూరు.. ఫొటో ఫీచర్
X

దిశ, నెట్ వర్క్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరుసగా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. చాలా చోట్ల ఇండ్లు, చెట్లు కూలాయి. వాగులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైనాయి. చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు వస్తోంది. అలాంపూర్ మండలం క్యాతూర్ లో గోడ కూలి 20 గొర్రెలు మృతి చెందాయి. కూలిన ఇండ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లల్లో ఉండకూడదని సూచిస్తున్నారు. పలు చోట్ల వరదనీటిలో చేపలు రావడంతో స్థానికులు ఎగబడుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 12 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.





















Next Story

Most Viewed