- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలకుర్తి వివాదం పార్టీకి నష్టం.. మల్లు రవి కీలక వ్యాఖ్యలు
పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, స్థానిక నేతల మధ్య నెలకొన్న వివాదాలపైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం సమావేశం అయింది.

దిశ, తెలంగాణ బ్యూరో : పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, స్థానిక నేతల మధ్య నెలకొన్న వివాదాలపైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదివారం సమావేశం అయింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత ఝాన్సీరెడ్డిలు హాజరయ్యారు. వారి నుంచి సమాచారాన్ని సేకరించారు. వివాదంపైన వారు వివరణలు ఇచ్చారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గంలో వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపామని, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీరెడ్డిలతో మాట్లాడామని తెలిపారు. ఈ రెండు గ్రూపులుగా విడిపోయిన నేతల తీరుతో పార్టీకి నష్టం జరుగుతుందని మల్లు రవి అన్నారు. పాలకుర్తి వివాదంపైన పరిశీలకుడిగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను నియమించినట్లుగా మల్లు రవి చెప్పారు. కాగా, కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల ఇటీవల నెలకొన్న వివాదంపైన క్రమశిక్షణ కమిటీ చర్చించింది. కాంగ్రెస్ నేత గడ్డం చంద్ర శేఖర్ రెడ్డిపై ఫిర్యాదు వచ్చిందని, తమకు అందిన ఫిర్యాదుల మేరకు నోటీసులు పంపుతున్నట్లుగా మల్లు రవి చెప్పారు.
దేశంలో తెలంగాణ మోడల్ : మల్లు రవి
హరీష్ రావు, కేటీఆర్ లు ఓడిపోయిన బాధలో మతిస్థిమితం కోల్పోయారని, పదేళ్ల పాటు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బయటకు రానివ్వలేదని మల్లు రవి చెప్పారు. తాము మీకు స్వేచ్ఛ ఇచ్చామని, కానీ మీరు కూల్చేస్తాం, పేల్చేస్తామని అంటున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ పాలన ఆదర్శనీయమని, దేశంలో తెలంగాణ మోడల్ గా మారుతుందన్నారు.






