BRS మీడియా ప్రకటనలపై విచారణ జరపండి.. గవర్నర్‌కు ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ లేఖ

by Gantepaka Srikanth |

సాగునీటి ప్రాజెక్టు(Irrigation Project)ల పేరుతో మీడియా పత్రికలు బీఆర్ఎస్​ప్రభుత్వం ఇచ్చిన వాణిజ్య ప్రకటనపై విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్​జిష్నుదేవ్​వర్మకు ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌(Forum for Good Governance) అధ్యక్షులు ప‌ద్మనాభరెడ్డి(Padmanabha Reddy) శుక్రవారం లేఖ రాశారు.

BRS మీడియా ప్రకటనలపై విచారణ జరపండి.. గవర్నర్‌కు ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: సాగునీటి ప్రాజెక్టు(Irrigation Project)ల పేరుతో మీడియా పత్రికలు బీఆర్ఎస్​ప్రభుత్వం ఇచ్చిన వాణిజ్య ప్రకటనపై విచారణ జరపాలని రాష్ట్ర గవర్నర్​జిష్నుదేవ్​వర్మకు ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌(Forum for Good Governance) అధ్యక్షులు ప‌ద్మనాభరెడ్డి(Padmanabha Reddy) శుక్రవారం లేఖ రాశారు. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 2023 నవంబర్​వరకు రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసి 70 శాతం పనులు పూర్తి చేసినట్లు అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని వారాల ముందు మీడియాకు పెద్ద ఎత్తున రూ. 22 కోట్ల 13 లక్షల 55 వేల విలువ చేసే ప్రకటనలు ఇచ్చారని, ఇది ప్రజాధనాన్ని వృథా చేయడమే అవుతుందన్నారు. ర‌క‌ర‌కాల స‌మస్యలతో పూర్తికాని ఈ ప్రాజెక్టుకు 22.13 కోట్ల ప్రకటనల ఖ‌ర్చును అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఎన్నిక‌ల‌లో ల‌బ్ధి పొంద‌డానికి చేసిన ప‌నిగా కనిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర స‌మితి 2022లో జాతీయ పార్టీగా మారిందని, దీనిని అన్ని రాష్ట్రాల‌లో గుర్తింపు కోసం అప్పటి నుండి ప్రకటనల రూపంలో ప్రజాధనాన్ని ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేసిందన్నారు. తెలంగాణలోని ఈ పార్టీపై తెలుగులోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, మ‌ల‌యాళం, త‌మిళం, మ‌రాఠి, ఒరియా, గుజ‌రాతీ, బెంగాలీ, పంజాబీ పత్రికలకు కూడా ప్రకటనలు ఇచ్చుకున్నారన్నారు. ఇది ఎట్టి ప‌రిస్థితిలోనూ స‌మ‌ర్ధనీయం కాదని ఈ విష‌యంపై విచార‌ణ జ‌ర‌పాలని కోరుతున్నానన్నారు. ప్రజాధనాన్ని ఎన్నికల ల‌బ్ధి కోసం వాడిన దోషుల‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని రాష్ట్ర గ‌వ‌ర్నర్‌కు రాసిన లేఖలో పద్మనాభన్​పేర్కొన్నారు.

Next Story