Padma Awards: తెలంగాణకు రెండు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదు

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-25 16:43:20  IST  )

కేంద్ర ప్రభుత్వం(Central Govt) ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కాయి.

Padma Awards: తెలంగాణకు రెండు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం(Central Govt) ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారికి ఏడు అవార్డులు దక్కాయి. అందులో తెలంగాణ(Telangana)కు రెండు రాగా.. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు ఐదు లభించాయి. తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణకు(పద్మశ్రీ), వైద్య విభాగంలో దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషన్ అవార్డులు దక్కాయి. ఇక ఏపీ నుంచి విద్య, సాహిత్యం విభాగంలో కేఎల్ కృష్ణకు పద్మశ్రీ, కళారంగంలో మాడుగుల నాగఫణి శర్మకు పద్మశ్రీ, కళారంగంలో మిరియాల అప్పారావుకు పద్మశ్రీ, విద్య, సాహిత్యం విభాగంలో రాఘవేంద్రచార్యకు పద్మశ్రీ, సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ లభించాయి. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దేశంలో పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.

Next Story