- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ లేకపోతే ఈటల ఎవరో ప్రపంచానికి తెలియదు: పాడి కౌశిక్ రెడ్డి
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంపై ప్రేమ ఉన్నట్టు ఈటల కొత్త నాటకాలు మొదలుపెడుతున్నారని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంపై ప్రేమ ఉన్నట్టు ఈటల కొత్త నాటకాలు మొదలుపెడుతున్నారని అన్నారు. హుజురాబాద్ లో ఓడిపోయిన వెంటనే మీరు గజ్వెల్, మల్కాజ్ గిరిలో ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలు అధికారం లేకుండా ఉండలేరా అని ప్రశ్నించారు. దామోదర్ రెడ్డి ఓడిపోయినప్పుడు ఇదే హుజురాబాద్ లో ఉన్నారని చెప్పారు. తాను కూడా హుజురాబాద్ లో ఓడిపోయినా ఇదే ప్రాంతంలో ఉండి పోటీ చేసి గెలిచానని అన్నారు.
ఇప్పుడు అధికారం, ఉనికి కోసం హుజూరాబాద్ బిడ్డ అని చెప్పుకుని ఈటల రాజేందర్ తిరుగుతున్నారని చెప్పారు. 107 పంచాయితీ స్థానాలు ఉంటే ఈటల రాజేందర్ ఊరూరు తిరిగిగా ప్రజలు మిమ్మల్ని 20 స్థానాల్లో కూడా గెలవనివ్వలేదని అన్నారు. కేసీఆర్ లేకపోతే ఈటల రాజేందర్ ఎవరో ప్రపంచానికి తెలియదు అన్నారు. అలాంటి అన్నం పెట్టిన వ్యక్తికి, అన్నం పెట్టిన హుజురాబాద్ ప్రజలను మోసం చేసి వెళ్లిపోయారన్నారు. ప్రజలు మీ నాటకాలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.






