- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఓవర్సీస్ స్కాలర్షిప్ విడుదల
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.

దిశ, వెబ్ డెస్క్ : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల చొప్పున మొత్తం 2,288 మంది విద్యార్థులకు రూ.304 కోట్లు విడుదల చేసినట్టు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులందరికీ ఉన్నత విద్య ద్వారా సమాన అవకాశాలు , ఉజ్వల భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.
గురువారం తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... 2022 నుంచి అక్టోబర్ 2025 వరకు ఉన్న బకాయిలు... 3642 మంది విద్యార్థులకు గాను రూ.463 కోట్లు విడుదల చేశామని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులకు నేరుగా వారు బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమవుతుందని తెలిపారు. యూకే, అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాతో పాటు పలు విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభుత్వం ఊరట కల్పించిందని లక్ష్మణ్‌కుమార్ చెప్పారు.
ప్రస్తుతం విదేశాల్లో అననూకూల పరిస్థితుల కారణంగా మన రాష్ట్ర విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకు ఈ నిధుల ద్వారా వారికి ఉపశమనం లభిస్తుందని అన్నారు.






