- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం!.. బైక్ నడిపిన మంత్రి పొంగులేటి
ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో పలు ప్రభుత్వ పనుల పరిశీలనకు వెళ్లిన ఆయన బైక్ పై ప్రయాణించారు. స్వయంగా ఆయనే బైక్ నడిపిస్తూ.. కార్యకర్తలు, అభిమానులతో కలిసి వెళ్లారు. వర్షకాలం సమీపిస్తుండటంతో మున్నేరు డ్యాం రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను ప్రభుత్వం శరవేగంగా జరిపిస్తున్నది.
ఈ సందర్భంగా తన అనుచరులతో మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం కు సంబందించిన పనులను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడి అధికారులను కలిసి పనులపై ఆరా తీశారు. పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఖమ్మం రూలర్ మండలంలో బైక్ పై ప్రయాణిస్తూ.. దారిలో కలిసిన వారిని పలకరించారు. అంతేగాక అక్కడి ప్రభుత్వ పనులకు సంబందించిన గ్రౌండ్ వర్క్ ను మంత్రి సమీక్షించారు. దీనికి సంబందించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. దీనిపై ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని రాసుకొచ్చారు.






