తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. 16 జిల్లాలకు అలర్ట్

by Ajay Maddhiboyina |

తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.

తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. 16 జిల్లాలకు అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకూ పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండల తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐదు రోజుల పాటూ ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మధ్య మధ్యలో ఉష్ణోగ్రతల్లో మార్పులు జరగటంతో కొన్ని జిల్లాల్లో ఎండలు కాస్త తక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు వాతావరణ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఆకస్మికంగా వాతావరణంలో మార్పులు జరిగి వర్షాలు కురుస్తున్నాయి.

Next Story