కంచే చేను మేసినట్లు.. సైబర్ నేరగాళ్లతో బ్యాంకు ఉద్యోగులు లింకు!

by Prasad Jukanti |   (  Updated:2026-02-24 07:55:52  IST  )

హైదరాబాద్ పోలీసులు సైబర్ నేరగాళ్ల భరతం పట్టారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో 16 రాష్ట్రాల్లో రెయిడ్స్ నిర్వహించారు.

కంచే చేను మేసినట్లు.. సైబర్ నేరగాళ్లతో బ్యాంకు ఉద్యోగులు లింకు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) మరోసారి సత్తా చాటారు. దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ చేపట్టి సైబర్ క్రిమినల్స్ భరతం పట్టారు. ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో (Operation Octopus) హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‍లో విస్తుపోయే విషయాలు అందరినీ షాక్‍కు గురి చేస్తున్నాయి. దేశంలోని మొత్తం 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సైబర్ నేరాల సిండికేట్‍పై (cyber crime syndicate) దాడులు నిర్వహించి మొత్తం 104 మందిని అరెస్టు చేశారు. సైబర్ నేరాల కోసం వాడుతున్న 152 బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లతో పాటు పలువురు బ్యాంకు అధికారులు కూడా ఉండటం గమనార్హం. నిందితులన నుంచి 204 మొబైల్స్, 141 సిమ్ కార్డులు, 234 డెబిట్ కార్డులు, 26 ల్యాప్ టాప్ లు, 56 స్టాంప్‍లతో పాటు రూ. 36 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో బ్యాంకు అధికారులు:

కంచే చేను మేసింది అన్న చందంగా సైబర్ నేరాలను అడ్డుకోవడంలో కస్టమర్లకు సహకారం అందించాల్సిన బ్యాంకు ఉద్యోగులే అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెడుతూ ఈ ఆపరేషన్‍లో అడ్డంగా దొరికిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు రోజు రోజుకు సైబర్ నేరాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కష్టార్జితంతో రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్ము ఏ క్షణంలో కేటుగాళ్ల వశం అవుతాయో తెలియని ఆందోళన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమ బ్యాంకు కష్టమర్లు, ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అవగాహన కల్పించడమో లేదా వారికి సహాయపడటమే చేయాల్సిన బ్యాంకు ఉద్యోగులే ఇలా సైబర్ నేరగాళ్లతో చేతులులు కలిపితే ఇక తమకు దిక్కెవరూ అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story