HYD: ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రిలో తీవ్ర విషాదం.. ఒకరు మృతి, 30 మందికి సీరియస్

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-03 13:07:19  IST  )

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రి(Erragadda Hospital)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

HYD: ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రిలో తీవ్ర విషాదం.. ఒకరు మృతి, 30 మందికి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రి(Erragadda Hospital)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫుడ్ పాయిజన్(Food Poisoning) కారణంగా 30 మందికి పైగా మానసిక రోగులు(Psychiatric Patients) అస్వస్థతకు గురయ్యారు. ఇందులో కార్డియాక్ అరెస్ట్‌తో కరణ్ అనే రోగి మృతిచెందారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన అందరికీ మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి వచ్చిన వైద్యాధికారులు ఫుడ్ పాయిజన్‌పై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఫుడ్ పాయిజన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story