HYD: గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌(Hyderabad)లోని గచ్చిబౌలి(Gachibowli) పరిధి వట్టినాగులపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.

HYD: గచ్చిబౌలిలో తీవ్ర విషాదం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లోని గచ్చిబౌలి(Gachibowli) పరిధి వట్టినాగులపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షానికి(Heavy Rain) వట్టినాగులపల్లిలో ఓ ఇంటి గోడ కూలింది. ఒకరు మృతి(One dead)చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు(Four injured) అయ్యాయి. దీంతో పురాతన ఇళ్లలో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హైదరాబాద్‌లో వర్షం భారీ స్థాయిలో కురిసింది. గంటల వ్యవధిలో 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలి, హిమాయత్‌నగర్‌, వనస్థలిపురం, బోడుప్పల్‌, పీర్జాదిగూడ, పోచారం, నారపల్లిలో వర్షం. బషీర్‌బాగ్‌, నాంపల్లి, అబిడ్స్‌, కోఠి, ఎంజే మార్కెట్‌, బేగం బజార్‌లో వర్షం. ఎల్బీనగర్‌, హయత్‌ నగర్‌, అబ్దుల్లాపూర్‌ మెట్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మణికొండ, ముషీరాబాద్‌, రామ్‌నగర్‌, తార్నాక, కాచిగూడ, కుషాయిగూడ, కాప్రా, కీసర తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయ్యాయి. దీంతో వాహనచోదకులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి.

Next Story