మరోసారి కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు.. హజరుకానున్న హరీశ్ రావు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-08 04:14:11  IST  )

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ (Kaleshwaram Lift Irrigation) సంబంధిత అంశాలపై విచారణ చేపడుతోన్న కమిషన్‌ విచారణ ప్రక్రియను తుది దశకు చేరింది.

మరోసారి కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు.. హజరుకానున్న హరీశ్ రావు
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ (Kaleshwaram Lift Irrigation) సంబంధిత అంశాలపై విచారణ చేపడుతోన్న కమిషన్‌ విచారణ ప్రక్రియను తుది దశకు చేరింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన లోపాలు, వైఫల్యాలపై జస్టిస్‌ పీ చంద్రఘోష్‌ (Justice P Chandraghosh) కమిషన్‌ విచారణ ఏడాది కాలంగా కొనసాగుతోంది. బ్యారేజీల డిజైన్‌, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ, సాంకేతిక, ఆర్థిక, విధానపరమైన అంశాలపై ఇంజినీర్లు, ఉన్నతాధికారులు, ఇతరులను విచారించింది. అదేవిధంగా వారి నుంచి అఫిడవిట్లు తీసుకుని వాటి ఆధారంగా క్రాస్‌ ఎగ్జామినేషన్ చేసింది. అయితే, జూన్ 9న కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన హరీశ్ రావు (Harish Rao)ను తిరిగి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ మధ్యాహ్నం మాజీ సీఎం కేసీఆర్‌ (KCR)తో భేటీ అనంతరం హరీశ్ రావు విచారణ నిమిత్తం బీఆర్కే భవన్‌కు వెళ్లనున్నారు.

కాగా, తెలంగాణ నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.అనిల్ కుమార్‌ (Anil Kumar) సోమవారం కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage)కు గ్రౌటింగ్ చేసిన విషయాన్ని ఎంక్వైరీలో దాచిపెట్టిన విషయాన్ని కమిషన్ గుర్తించింది. అదేవిధంగా ఉన్నత హోదాలో ఉండి అబద్ధపు స్టేట్‌మెంట్ ఇచ్చినందుకు ఆయనపై చైర్మన్ పీ చంద్రఘోష్ (P Chandraghosh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు నోటీసులు ఇచ్చి రేపు విచారణకు హాజర కావాలని కమిషన్ ఆదేశించింది. మాజీ ఈఎన్సీ అనీల్ కుమార్ నోటీసుల ఇచ్చిన మరునాడే కాళేశ్వరం కమిషన్ హరీశ్ రావును మరోసారి విచారణకు పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Next Story