- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth: కేసీఆర్, డీకే అరుణ ఇద్దరూ కులగణన సర్వేలో పాల్గొనలేదు
కులగణన సర్వే(Caste Census Survey) నివేదికపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(Payal Shankar) చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: కులగణన సర్వే(Caste Census Survey) నివేదికపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(Payal Shankar) చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. పాయల్ శంకర్ ప్రజల్లో అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ఆ సర్వే నివేదికలో జనాభా లెక్కలపై తేడాలు ఉన్నాయని వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ప్రకారం బీసీ జనాభా 51 శాతంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. తాము చేసిన తాజాగా సర్వే నివేదిక ప్రకారం బీసీ జనాభా 56 శాతానికి పెరిగారని అన్నారు. శాస్త్రీయంగా చేసిన సర్వే ప్రకారం బీసీ జనాభా పెరిగినట్లు తేలిందని అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక అఫీషియల్ డాక్యుమెంటా? కాదా? అనేది చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులను అడిగారు.
తాము చేసిన సర్వేలో కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao), డీకే అరుణ(DK Aruna) సహా అనేకమంది పాల్గొనలేదని అన్నారు. భూమి వివరాలు చెప్పాలని సర్వేలో ఉండటంతో కేసీఆర్ సహా బీఆర్ఎస్(BRS) నేతలు ఎవరూ పాల్గొనలేదని ఎద్దేవా చేశారు. కాగా, అంతకుముందు సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు. జనగణన కంటే పకడ్బందీగా కులగణన చేశాం. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించాం. ఒక ఎన్యుమరేటర్ రోజుకు 10 ఇళ్లకంటే ఎక్కువ ఇళ్లలో సర్వే చేయలేదు. 8 పేజీలతో ఉన్న ప్రశ్నపత్రంలో సమగ్ర వివరాలు నమోదు చేశాం. మొత్తంగా రూ. 125 కోట్లు ఖర్చు చేసి సర్వే ద్వారా సమగ్ర వివరాలు సేకరించాం అని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
సర్వే ప్రకారం :
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), బీసీలు (ముస్లిం మైనారిటీ మినహా) 1,64,09,179 (46.25 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ముస్లిం మైనారిటీలు 44,57,012 (12.56 శాతం) మంది ఉన్నారు.






