- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓనమాలు రానోళ్లు జర్నలిస్టులు అవుతుండ్రు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్లు లేరని.. అదేవిధంగా అధికారంలో ఉన్న వారిని గద్దె దింపడంలోనూ వాళ్లే ఉపయోగపడుతారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపడంలో కమ్యూనిస్టులను మించిన వాళ్లు లేరని.. అదేవిధంగా అధికారంలో ఉన్న వారిని గద్దె దింపడంలోనూ వాళ్లే ఉపయోగపడుతారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ ‘నవ తెలంగాణ’ 10 వార్షికోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జర్నలిజం విలువలు పూర్తిగా దెబ్బతిన్నాయని కామెంట్ చేశారు. ఓనమాలు కూడా రానివాళ్లు సోషల్ మీడియా ముసుగుతో జర్నలిస్టుగా చలామణి అవుతున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి వారిని సీనియర్లు జర్నలిస్టులు పక్కన పెట్టాలని.. కనీసం పక్కన కూడా కూర్చొబెట్టుకోవద్దని అన్నారు. ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ.. అసభ్యకరంగా మాట్లాడేవాడు జర్నలిస్టు అని చెప్పుకోవడం సోచనీమని పేర్కొన్నారు. తనకు మొదటి నుంచి కమ్యూనిస్టులంటే అపారమైన గౌరవం ఉందన్నారు. 2004లోనూ కాంగ్రెస్ గెలుపులో వారి పాత్ర మరువలేనదిన అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు గలమెత్తాలన్నా.. అధికారంలో ఉన్నోళ్లను గద్దె దింపడానికైనా కమ్యునిస్టులు ఉపయోగపడతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయ నేతల విశ్వసనీయత దెబ్బతిన్నట్లుగానే.. జర్నలిస్టుల విశ్వసనీయత క్రమంగా తగ్గుతూ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.






