- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM రేవంత్ ఇంటి కాంపౌండ్‌ను కూల్చిన అధికారులు (వీడియో)
స్థలం విషయంలో చిన్న చిన్న నాయకులే హడావిడి చేసి.. పలుకుబడి చూపించుకుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: స్థలం విషయంలో చిన్న చిన్న నాయకులే హడావిడి చేసి.. పలుకుబడి చూపించుకుంటారు. అధికారులకు వార్నింగ్‌లు ఇస్తుంటారు. ముఖ్యంగా ఇటీవల హైడ్రా అధికారులకు అనేక చోట్ల లోకల్ లీడర్లు అడ్డుపడటాలు, పలుకుబడి చూపించే ప్రయత్నాలు చేయడాలు అనేకం జరిగిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదర్శంగా నిలిచే పనిచేశారు. రేవంత్ రెడ్డి స్వగ్రామం అయిన కొండారెడ్డిపల్లి(Kondareddypalli)లో రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా అధికారులు సీఎం ఇంటి కాంపౌండ్(Revanth Reddy House)ను కూల్చారు. దీనికి సీఎం రేవంత్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ అడ్డు చెప్పకపోవడం గమనార్హం. దీనిని అక్కడే ఉన్న కొందరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. అది గమనించిన నెటిజన్లు రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తు్న్నారు. ‘ఇదే రేవంతన్నకు, కేసీఆర్‌కు ఉన్న తేడా. సొంత ఇల్లు కాంపౌండ్ కూల్చినా సహకరించిన రేవంత్ రెడ్డి ఎక్కడ.. ఫామ్ హౌజ్ నుండి కాళేశ్వరం డిజైన్ మార్చిన కేసీఆర్ ఎక్కడ’ అని విమర్శలు చేస్తున్నారు.






