- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయి.. ఎన్నిసార్లు తీసుకున్నారు'..?
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మను మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ జరిపారు.

దిశ, శంషాబాద్ : మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పోలీసులు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, అలాగే నమిత్ శర్మను మరోసారి కస్టడీకి తీసుకొని విచారణ జరిపారు. రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాల మేరకు మరో మూడు రోజుల పాటు విచారణ కోసం వారిని కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నిందితులు ముగ్గురిని చంచల్ గూడ జైలు నుంచి పటిష్ట బందోబస్తు మధ్య పోలీసు అధికారులు వారిని శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. సిట్ బృందం విచారణ అధికారి చేవెళ్ల బీసీపీ యోగేష్ గౌతమ్, షాద్ నగర్ డీసీపీ శిరీష తోపాటు ఈగల్ టీం ఏసీపీ నిందితులను ప్రశ్నించారు. అలాగే ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు సైతం పోలీస్ స్టేషన్ కి చేరుకొని నిందితులను విచారణ జరిపారు. ప్రధానంగా నిందితులకు డ్రగ్స్ ఎలా వచ్చాయి..? ఎన్నిసార్లు తీసుకున్నారు..? పార్టీలో గతంలో ఎక్కడెక్కడ నిర్వహించారు అనే అంశాలపై ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితులను గురువారం, శుక్రవారం కూడా విచారణ జరపనున్నారు. పోలీసులు ఐదు రోజుల కస్టడీ పిటిషన్ వేయగా కోర్టు మూడు రోజులు అనుమతించింది.






