- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NVSS Prabhakar: బీజేపీ అధ్యక్షుడు నియామకంపై ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై అధిష్టానం సంతృప్తి కరంగా ఉందని, ఎందుకంటే వారికి రావలసిన వాటా వారికి సకాలంలో చేరుతోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై అధిష్టానం సంతృప్తి కరంగా ఉందని, ఎందుకంటే వారికి రావలసిన వాటా వారికి సకాలంలో చేరుతోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) తీవ్ర విమర్శలు చేశారు. కానీ కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తి కరంగా ఉన్నారా? లేదా అనేది ప్రధాన అంశమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)కు సూచించారు. ఈ మేరకు ఆయన శనివారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇటీవల కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే వచ్చి మంత్రుల పనితీరు రిపోర్టును చూశారని, అందులో పనితీరులో పాస్ మార్కుల కంటే ఆద్వానంగా ఉందని ఖర్గే, ఏఐసీసీ నేతలకు అర్థం అయిందని తెలిపారు. అందుకే ఢిల్లీకి ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుతున్నారని, అందులో భాగంగానే భట్టి విక్రమార్క కూడా వెళ్లారని అన్నారు. పదవిని కాపాడుకోవడం కోసం భట్టి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
మా పార్టీకి ఎవరు అధ్యక్షుడు ఉండాలనేది మేము నిర్ణయించుకుంటాము.. అని అన్నారు. అధిష్ఠానం ఆలోచన, కార్యకర్తల అభిప్రాయాల మేరకు మా పార్టీకి అధ్యక్షుడు ఎవరు ఉండాలనేది మేము నిర్ణయించుకుంటామని తెలిపారు. నిర్ణయించుకునే అధ్యక్షుడు పైన భట్టి విక్రమార్క వ్యాఖ్యలు చేయడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. ముందు నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్‌పై ఉన్నా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీని పదవుల నుంచి తప్పించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేయాలని ఎన్వీఎస్ఎస్ సూచించారు. దాంతో పాటు ఓటకు నోటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డిని కూడా సీఎం పదవి రాజీనామాకు డిమాండ్ చేయాలని సూచించారు. రాష్ట్రాన్ని నడిపించడంలో ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క వైఫల్యం చెందారని విమర్శలు గుప్పించారు. బీర్లు, భూములు అమ్ముకుంటేనే ఖజానాకు ఆదాయం వస్తుందనే విధానాన్ని కొనసాగిస్తున్న వ్యక్తి భట్టి విక్రమార్క అని తీవ్ర విమర్శలు చేశారు.
వీళ్లు మా పార్టీ అధ్యక్ష నియామకం గురించి మాట్లాడుతారా? అని నిలదీశారు. తెలంగాణ రైజింగ్ అని పెట్టారు.. ఎక్కడ రైజ్ అయిందని ప్రశ్నించారు. హత్యలు, ఆత్మహత్యలు, కల్తీ కల్లు ఘటనలు, రుణాలు సేకరించడం వంటి వాటిల్లో రైజింగ్ అయిందన్నారు. ఏసీబీ కేసుల్లో రైజింగ్.. అవినీతి, అక్రమాలు, డ్రగ్స్, చీటింగ్‌లో రైజింగ్, మంత్రుల ఆస్తులు పెంచుకోవడంలో రైజింగ్, ప్రభుత్వ ఆస్తులను అమ్మడంలో తెలంగాణ రైజింగ్ అయిందన్నారు.






