మూడు వైన్స్.. ఆరు బార్‌లుగా కొనసాగుతున్న ప్రభుత్వం : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

ప్రతి వారం ఏదో ఒక ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు వైన్స్.. ఆరు బార్‌లుగా కొనసాగుతున్న ప్రభుత్వం : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి వారం ఏదో ఒక ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS Prabhakar) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. కీలకమైన విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వద్దే ఉన్నా.. అనేక సార్లు రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగుతుంటే అసలు ఈ ప్రభుత్వం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై వెలుగులోకి వస్తున్న కొన్ని వస్తున్నాయని, బయటకు రాని సంఘటనలు మరికొన్ని ఉన్నాయన్నారు. అసలు ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉందని మండిపడ్డారు. గత ప్రభుత్వం బెల్టుషాపులు లేకుండా చేస్తామని చెప్పిందని, ఇప్పుడున్న ప్రభుత్వం సైతం అదే చెప్పిందన్నారు. కానీ ఎక్కడా మూసివేసిన దాఖలాలు మాత్రం లేదన్నారు.

మద్యం (Alcohol sales) అమ్మకాల ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలనే విధంగా గత ప్రభుత్వం ప్రయత్నించిందని, గతం కంటే మూడు రెట్లు పెంచి.. ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని విమర్శించారు. మూడు వైన్ షాపులు.. ఆరు బార్‌లు అన్నట్లు ఈ ప్రభుత్వం నడస్తోందని మండిపడ్డారు. కేవలం బార్లు, బీర్లు, భూములు అమ్మాలి.. ఇదే రాష్ట్రానికి ఆదాయమన్నారు. మద్యం మత్తులో ప్రజలను ఉంచి 6 గ్యారంటీలను మర్చిపోయేలా చేయాలని ప్రభుత్వం చూస్తోందని హాట్ కామెంట్స్ చేశారు. ఏ శాఖలో చూసిన అవినీతి మయం అయిందని ఆరోపించారు.

Next Story