Breaking News : నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు విడుదల

by Muthe.Rajitha |   (  Updated:2025-05-05 11:20:47  IST  )

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో గుడ్ న్యూస్ ప్రకటించింది.

Breaking News : నర్సింగ్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలను(Nursing Officer exam Results) ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. గత నవంబర్ 23న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 2,322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల కోసం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్(MHSRB) రాత పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలకు మొత్తం 42,244 మంది దరఖాస్తు చేసుకోగా.. 40, 423 మంది హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన రిజల్ట్స్ ను తెలంగాణ మెడికల్ బోర్డ్ ప్రకటించింది. త్వరలోనే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను విడుదల చేస్తామని పేర్కొంది. ఈ ఫలితాల కోసం https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story