NSUI: ఎన్ఎస్‌యూఐ నూతన అధ్యక్షుడిగా.. 'ఎడవల్లి వెంకట‌స్వామి'

by Geesa Chandu |   (  Updated:2024-08-14 07:11:26  IST  )

తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ నూతన అధ్యక్షుడిగా ఎడవల్లి వెంకటస్వామి నియమితులయ్యారు.

NSUI: ఎన్ఎస్‌యూఐ నూతన అధ్యక్షుడిగా.. ఎడవల్లి వెంకట‌స్వామి
X

NSUI: ఎన్ఎస్‌యూఐ నూతన అధ్యక్షుడిగా.. 'ఎడవల్లి వెంకట‌స్వామి'

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్‌యూఐ నూతన అధ్యక్షుడిగా ఎడవల్లి వెంకటస్వామి నియమితులయ్యారు. దేశ వ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలకు ఎన్ఎస్‌యూఐ యూనిట్లకు ప్రెసిడెంట్లు నియమిస్తూ.. కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. బీహార్ కు జై శంకర్ ప్రసాద్, చండీఘర్ కు సికిందర్ బూర, ఢిల్లీకి ఆశిష్ లంబా, హిమాచల్ ప్రదేశ్ కు అభినందన్ ఠాకూర్, జార్ఖండ్ కు బినాయ్ ఒరన్, మణిపూర్ కు జై సన్ కే హెచ్, ఒడిస్సా కు ఉదిత్ నారాయణ ప్రధాన్, వెస్ట్ బెంగాల్ కు ప్రియాంక చౌదరీ లను నియమించారు. ఇక తెలంగాణ ప్రెసిడెంట్ ఎంపికలో హై కమాండ్ ఆచితూచిగా వ్యవహరించినట్లు స్పష్టమవుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వెంకటస్వామి , కొన్నాళ్ల పాటు కొనసాగిన కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే అధ్యక్ష పదవి ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పటంతో.. వెంకటస్వామికి ప్రెసిడెంట్ పోస్ట్ ను కేటాయించినట్లు ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Next Story