పీజీ మెడికల్ సీట్ల రెండో విడత వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ విడుదల

by Ramesh Naini |

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోని పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) సీట్ల భర్తీకి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

పీజీ మెడికల్ సీట్ల రెండో విడత వెబ్ ఆప్షన్ల నోటిఫికేషన్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లోని పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) సీట్ల భర్తీకి సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌కు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంపిటెంట్ అథారిటీ కోటా కింద కన్వీనర్ సీట్ల భర్తీకి ఈ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 25వ తేదీ ఉదయం 9.00 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 6.00 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తుది మెరిట్ జాబితాలో పేరున్న వారు https://tspgmed.tsche.in వెబ్‌సైట్ ద్వారా తమ ప్రాధాన్యతలను తెలియజేయాల్సి ఉంటుంది.

మొదటి విడతలో సీటు వచ్చి చేరిన వారు, మొదటి విడతలో సీటు రాని వారు ఈ విడతకు అర్హులు. అయితే మొదటి విడతలో సీటు వచ్చినా చేరని వారు లేదా డిస్కంటిన్యూ చేసిన వారు రెండో విడత కౌన్సిలింగ్‌కు అనర్హులు. మొదటి విడతలో ఒక్క వెబ్ ఆప్షన్ కూడా ఇవ్వని అభ్యర్థులకు ఈ రెండో విడతలో అవకాశం లేదు. రెండో విడతలో అభ్యర్థి కోరుకున్న విధంగా సీటు లభిస్తే.. మొదటి విడతలో వచ్చిన సీటు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. అభ్యర్థులు తమకు నచ్చిన ఎన్ని సీట్లకైనా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. సీటు పొందిన అభ్యర్థులు రూ. 29,600 యూనివర్సిటీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడతలో ఇప్పటికే ఫీజు చెల్లించిన వారు మళ్లీ చెల్లించనక్కర్లేదు.

Next Story