HYD: కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌కు నోటీసులు

by Gantepaka Srikanth |

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం హైదర్ గుడ లోని కీర్తి రిచ్ మండ్‌లోని 50విల్లాలకు రాజేంద్రనగర్ ఆర్డీఓ నోటీసులు జారీచేశారు.

HYD: కీర్తి రిచ్ మండ్ విల్లాస్‌కు నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు భూసేకరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం హైదర్ గుడ లోని కీర్తి రిచ్ మండ్‌లోని 50విల్లాలకు రాజేంద్రనగర్ ఆర్డీఓ నోటీసులు జారీచేశారు. అయితే హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్(బాపుఘాట్) వరకు 9.2కిలోమీటర్ల పరిధి, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.8కిలోమీటర్ల పరిధిలో 50 ఎకరాల భూములను సేకరించాలని మూసీ రివర్ ఫ్రంట్ డవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) నిర్ణయించింది. దీనికి సంబంధించి గతంలోనే నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే.

21కిలోమీటర్ల పరిధిలో..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు పడింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నది పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. తొలి విడతలో హైదరాబాద్ జిల్లాలోని గోల్కండ మండలంలోనిఇబ్రహీంబాగ్, ఖిల్లా మొహ్మద్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ మండలంలోని హైదర్ గుడ, బుద్వేల్, ఉప్పర్ పల్లి, గండిపేట్ మండలంలోని దర్గకాలిష్ ఖాన్, కిస్మత్ పుర, గండిపేట, నార్సింగి, మంచిరేవుల, గంధంగుడ, హైదర్షాకోట్,, బండ్లగుడ గ్రామాల్లోని 50ఎకరాలను భూములను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. భూములను కోల్పోతున్న యజమానులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా భూ యజమానులకు తగిన నష్టపరిహారాన్ని టీడీఆర్ రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఈ భూసేకరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా సమర్పించాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Next Story