మా తోలు కాదు.. ప్రజలే మీ తోలు తీశారు: మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana) నీటి హక్కులను వాడుకోవడంలో సీఎంగా కేసీఆర్ (KCR)ఫెయిల్ అయ్యారని మంత్ర జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు.

మా తోలు కాదు.. ప్రజలే మీ తోలు తీశారు: మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) నీటి హక్కులను వాడుకోవడంలో సీఎంగా కేసీఆర్ (KCR)ఫెయిల్ అయ్యారని మంత్ర జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఓ మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ.. నీళ్ల విషయంలో కేసీఆర్ అనేక తప్పిదాలు చేశారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడానికే పాలమూరు (Palamuru)పై ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నారని కామెంట్ చేశారు. పదేళ్ల పాటు ప్రజలకు కేసీఆర్‌కు అధికారాన్ని కట్టబెట్టారని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కేవలం పంప్‌హౌస్‌ను ప్రారంభించి ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లుగా చెప్పారంటూ సెటైర్లు వేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇరిగేషన్ కోసం కాదు.. తాగునీటి కోసమే అని గతంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ చెప్పిందని గుర్తు చేశారు. ఆయన మా తోలు తీయడం కాదు.. ప్రజలు ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో, తాజాగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో తోలు తీశారని.. ఆ పార్టీకి కండ ఏమి లేదని మంత్రి జూపల్లి అన్నారు.

Next Story