- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్పంచ్‌గా నామినేషన్ వేసిన ఇద్దరు భార్యలు.. భర్త ఎవరివైపు!
సర్పంచ్‌గా నామినేషన్ వేసిన ఇద్దరు భార్యలు.. భర్త ఎవరివైపు!

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్ ఎన్నికల(Sarpanch Elections) వేళ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్బర్ పేట-భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్‌గా తన ఇద్దరు భార్యలతో ఓ వ్యక్తి నామినేషన్లు వేయించాడు. నేడు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియడంతో ఇద్దరు భార్యలు పోటీలో నిలిచారు. వీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయ్యేది. ఇప్పుడు ఇద్దరూ బరిలో ఉండేసరికి ఎవరిని గెలిపించాలని భర్త సందిగ్ధంలో పడిపోయారు. మరోవైపు.. ఉమ్మడి జిల్లాలో మూడు విడుతల్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అనేక చోట్ల సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడుతామని హామీలు ఇస్తున్నారు. అధికార పార్టీ అనేక ప్రలోభాలు పెట్టి స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ఎన్నికలు కొనసాగుతుండడంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో సందడి నెలకొన్నది. ఆశావహులు తమకు తోచిన ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. వార్డు సభ్యులను కూడా ప్యానల్‌గా మార్చుకొని ప్రచారం ప్రారంభించారు. గ్రామాల్లో అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలు కావడంతో సందడిగా మారింది. వారం రోజులే సమయం ఉండడంతో అభ్యర్థులు జోరుగా ప్రచారాన్ని ప్రారంభించారు.






