- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేదు : మల్లారెడ్డి కోడలు
తమ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆదాయపు పన్ను (IT) శాఖ సోదాలు జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి (MLA Mallareddy) కోడలు ప్రీతి రెడ్డి(Priti Reddy) స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : తమ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆదాయపు పన్ను (IT) శాఖ సోదాలు జరగలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి (MLA Mallareddy) కోడలు ప్రీతి రెడ్డి(Priti Reddy) స్పష్టం చేశారు. గతంలో ఒక ఈడీ కేసుకు సంబంధించి వరంగల్ పోలీసులు వెరిఫికేషన్ కోసం తమ నివాసానికి వచ్చారని, అంతకు మించి ఎలాంటి సోదాలు జరగలేదని తెలిపారు. అయితే కొన్ని మీడియా ఛానెల్స్ లో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి, ప్రీతి రెడ్డి నివాసాలపై ఐటీ దాడులు జరిగాయని వచ్చిన వార్తలు అవాస్తవం అన్నారు.
మల్లారెడ్డి విద్యా సంస్థలైన ఇంజినీరింగ్, మెడికల్ సీట్లకు సంబంధించిన డొనేషన్లు, ఫీజుల అక్రమాలు, ఆదాయపు పన్ను గణాంకాల్లో అసమానతలపై దర్యాప్తు జరుగుతోందని పలు న్యూస్ ఛానల్స్ కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ప్రీతి రెడ్డి ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. తమ ఇంటిపై సోదాలు జరిగినట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఇది కేవలం గత ఈడీ కేసు సంబంధిత వెరిఫికేషన్ మాత్రమేనని స్పష్టం చేశారు.






